మీ తాత సొమ్మడగడంలేదు మోదీ తాతా!

11 February, 2019 - 2:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మోదీ తాతా.. ఏపీ ప్రజలు తమ హక్కులు అడుగుతున్నారే గానీ మీ తాత సొమ్మేమీ అడగడం లేదని నటి దివ్యవాణి ఫైరయ్యారు. ధర్మమంటే తెలియని, అవినీతికి ప్రతీకగా ఉన్న నరేంద్ర మోదీ తాతగారి బుర్ర తిరిగే విధంగా ఆంధ్రప్రజలు, ఆవేదనతో, ఆవేశంతో ధర్మపోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మపోరాటం దీక్షా వేదిక నుంచి దివ్యవాణి ఆవేశంగా ప్రసంగించారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆవేదన మీకు అర్థం కావడంలేదా? అంటూ మోదీని దివ్యవాణి నిలదీశారు. తిరుపతిలో మీరిచ్చిన హామీ గుర్తులేదా అని ప్రశ్నించారు. పరిపాలన చేతకాకపోతే చంద్రన్న గడ్డం పట్టుకుని తెలుసుకో అంటూ నిప్పులు చెరిగారు.