అర్చన ‘పెళ్లి’!

04 October, 2019 - 7:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ నటి అర్చన ఎంగేజ్‌మెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. వరుడు జగదీశ్.. చెన్నైలోని ఓ హెల్త్ కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కి టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా శివబాలజీ దంపతులు, హీరో నవదీప్‌, సుమంత్ తదితరులు తరలి వచ్చారు. అర్చన, జగదీశ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2004లో నేను చిత్రంలో అల్లరి నరేష్ సరసన అర్చన నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిష స్నేహితురాలి పాత్రలో ఒదిగిపోయి నటించింది అర్చన. అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ, ఖలేజా, బ్యాంక్, బలుపు, లయన్ చిత్రాల్లో నటించింది. ఇక బిగ్ బాస్ హోస్‌లోకి కూడా అర్చన వెళ్లింది. అదే విధంగా టీవీల్లో ప్రసారమైన పలు డ్యాన్సు షోలకు సైతం ఆమె హోస్ట్‌ గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు, తమిళ, మలయాళం చిత్రాల్లో సైతం ఆమె నటించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అర్చన బీజేపీ తరఫున ప్రచారం కూడా చేసిన సంగతి తెలిసిందే.