తేజ దర్శకత్వంలో..

11 February, 2020 - 8:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి  ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఏడాది చివరిలో ప్రారంభంకానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి. అయితే ఇప్పటికే రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రానికి రాక్షస రాజు.. రావణాసురుడు అనే టైటిల్ ఖరారు చేసిన విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇప్పటికే రానా విరాటపర్వం చిత్రంలో నటిస్తు బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. సురేష్ ప్రోడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అలాగే రానా నటిస్తున్న త్రి భాష చిత్రం అరణ్య.  ప్రభు సాల్మాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.