ట్రైలర్‌లో సూపర్ ‘యాక్షన్’

13 September, 2019 - 8:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: అయోగ్య తర్వాత విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా నటిస్తుంది. సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్‌ అని .. ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ అంతా విదేశాల్లో జరుపుకున్నట్లు సమాచారం. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా.. అయితే ఈ చిత్రంలో బికినీ వేసుకుని నటించింది.

దీంతో తమన్నా ఫాన్స్ పులకించి పోతున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ రవీంద్రన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ సంగీతం అందిస్తున్నారు. అయితే తమన్నా నటించిన తాజా చిత్రం  సైరా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఇక విశాల్ ఇంతకుముందు నటించిన అయోగ్య. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రానికి తమిళ రిమేక్ అన్న విషయం విదితమే.