‘ఏబీసీడీ’ ట్రైలర్

15 April, 2019 - 1:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. ఆమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ అన్నది ఉప శీర్షిక. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా విడుదల చేశారు. హాయ్ నా పేరు అవి.

నేను జీవితంలో మూడు ‘E’లను ఫాలో అవుతుంటాను.. ఎంజాయిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎగ్జైట్‌మెంట్ అంటూ అల్లు శిరీష్ చెబుతున్న డైలాగ్‌తో ఈ చిత్ర ట్రైలర్ ప్రారంభమవుతోంది. యూఎస్‌లో రిచ్ ఫ్యామిలో జన్మించిన వ్యక్తి.. భారత్‌కు వచ్చి ఓ మధ్య తరగతి జీవితం గడపలేక ఎలా సతమతమయ్యాడు అనేది ఈ చిత్రంలోని కథాంశం.

ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగబాబు, కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు.