‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రిలీజ్

07 January, 2018 - 4:41 PM

మంచు విష్ణు- బ్రహ్మానందం కాంబినేషన్‌లో జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు- జి.నాగేశ్వర్‌రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా విష్ణు- బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనున్నాయి. బ్రహ్మానందం, విష్ణు, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ ఈ చిత్రంలో పూజారులుగా నటిస్తున్నారు. అమెరికా వెళితే ఆదాయం ఎక్కువ ఉంటుందనే ఆశతో వెళ్లిన వారు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులు. మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథ సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరిగింది.

‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రానికి కథ: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: వెంకట్, డ్యాన్స్: ప్రేమ్ రక్షిత్- దినేష్- గణేష్, కాస్ట్యూమ్స్: నరసింహ, లిరిక్స్: భాస్కరభట్ల, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణప్రసాద్, స్టిల్స్: రాజు, మాటలు: డార్లింగ్ స్వామి, స్క్రీన్‌ప్లే: విక్రమ్ రాజ్- నివాస్- వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం: సిద్ధార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి- కిట్టు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.