న్యూవేవ్స్ మీడియా ఆధ్వర్యంలో 99టీవీ చానల్

11 July, 2018 - 4:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: జర్నలిజం విలువలకు కట్టుబడి.. ప్రతీ క్షణం ప్రజల పక్షాన పనిచేస్తున్న న్యూవేవ్స్ మీడియా ఇప్పుడు సరికొత్త తరంగంలా దూసుకొచ్చింది. ఒక వైపు డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తూనే మరోవైపు శాటిలైట్ టీవీ చానల్ రూపంలో ప్రజల ముందుకు వచ్చింది. వందకు వంద శాతం నిష్పక్షపాతంతో క్షణక్షణం వార్తలు అందించేందుకు సిద్ధమైంది.

అన్ని రంగాల్లోనూ సరికొత్త కోణాలను ఆవిష్కరించి ప్రజల ఆదరాభిమానాలు పొందటానికి ప్రయత్నించనుంది. న్యూ వేవ్స్ మీడియా బుధవారం 99 టీవీ చానల్‌ను టేకోవర్ చేసింది. ఈ మేరకు న్యూవేవ్స్ మీడియా యాజమాన్యం 99 టీవీ చానల్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించింది. అక్రమాలను, అన్యాయాలను, దుర్మార్గాలను అరికట్టి సమాజానికి మేలు చేసే విధంగా ప్రజల వెంట ఉండి పోరాడనుంది. నిజాలను నిర్భయంగా చెప్పగలిగే చానల్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో నూవేవ్స్ మీడియా ఆ లోటు తీర్చనుంది.ఏపీకి ప్రత్యే హోదా కోరుతూ మూడు నాలుగు లక్షల మంది ప్రజలు విశాఖపట్నంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తే పట్టుమని పది నిమిషాలైనా ఆ వార్తను ప్రజలకు అందించలేని స్థితిలో ప్రస్తుతం మీడియా ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజలు అసహ్యించుకునే రీతిలో ఉద్దేశ పూర్వకంగా చర్చలు జరపటం, హిందూ దేవుళ్లను అవమానించటం, సమాజంలోని వ్యక్తుల స్థాయిని తగ్గించే విధంగా డిబేట్లు పెట్టడం లాంటి వాటన్నింటికీ భిన్నంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిజమైన ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకు, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలకు తెలియజేసేందుకు న్యూవేవ్స్ మీడియా 99 టీవీ చానల్ రూపంలో క‌ృషి చేయనుంది.

అంకిత భావంతో నిజానిజాలను వెలికి తీసి పేదల తరఫున న్యూవేవ్స్ మీడియా 99 చానల్ పోరాడనుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలనే మనస్తత్వం న్యూవేవ్స్ మీడియా నాయకత్వంలో ఉండటం గమనార్హం.