ఈసారి దక్కని ‘పోస్టింగ్’

22 June, 2019 - 4:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 42 మంది ఐఏఎస్‌ అధికారులను వైయస్ జగన్ సర్కార్ బదిలీ చేసింది. వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి నెలరోజుల లోపే రెండో సారి ఐఏఎస్‌లను బదిలీ చేయడం గమనార్హం.

గతంలో సాధారణ పరిపాలన శాఖకు పంపిన వారికి ఈ బదిలీలో భాగంగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలో మాజీ సీఎం చంద్రబాబు పేషీలో విధులు నిర్వహించిన ఐఏఎస్‌లు సతీష్ చంద్ర, సాయి ప్రసాద్, రాజమౌళీలకు ఈ బదిలీల్లో పోస్టింగ్ దక్కలేదు.

అలాగే గత ప్రభుత్వంలో ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా పని చేసి… కీలకంగా వ్యవహరించిన వెంకయ్య చౌదరి, స్కూల్ యూనిపాం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వ శిక్షా అభియాన్ ఎస్పీడీ జీ శ్రీనివాసరావుతోపాటు కోటేశ్వరరావు, నాగరాణిలను జీఏడీలో రిపోర్ట్ చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇక కీలకమైన ఆర్థిక శాఖ కార్యదర్శి స్థానం నుంచి ఎం రవిచంద్రను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి: బి రాజశేఖర్
వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి: మధుసూదన్ రెడ్డి
కార్మిక ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శి: ఉదయలక్ష్మీ
ఇంటర్ బోర్డు కార్యదర్శి: కాంతిలాల్ దండే
జీఏడీ కార్యదర్శి: శశిభూషణ్ కుమార్
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ: ఆర్పీ సిసోడియా (జీపీఆర్ అండ్ ఏఆర్)
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి: రవిచంద్ర
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి: ముఖేష్ కుమార్ మీనా
వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ : అరుణ్ కుమార్
పర్యాటక శాఖ స్పెషల్ కమిషనర్ : ప్రవీణ్ కుమార్
విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ కమిషనర్: కన్నబాబు
విజయవాడ మున్సిపల్ కమిషనర్: ప్రసన్న వెంకటేష్
బీసీ కార్పొరేషన్ ఎండీ: రామారావు
ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ : కార్తికేయ మిశ్రా
ఆరోగ్య శ్రీ సీఈవో: మల్లిఖార్జున
ఏపీఈపీడీసీఎల్ ఎండీ: నాగలక్ష్మీ
తిరుపతి మున్సిపల్ కమిషనర్: గిరీషా
మార్క్ ఫెడ్ ఎండీ: విజయరామారాజు
ఏపీ ట్రాన్స్‌కో ఎండీ: చక్రధర్ బాబు
జీవీఎంసీ కమిషనర్: జి సృజనా
ఏపీఐఐసీ ఈడీ: హరినారాయణ
గిరిజన శాఖ డైరెక్టర్: రంజిత్ బాషా
ఎస్సీ కార్పోరేషన్ ఎండీ: గంధం చంద్రుడు
కడప జిల్లా జాయింట్ కలెక్టర్: గౌతమి
అనంతపురం మున్సిపల్ కమిషనర్: ప్రశాంతి
శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ : శ్రీనివాసులు
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ : మార్కండేయులు
పార్వతీపురం ఐటీడీఏ పీవో: వినోద్ కుమార్
గిడ్డంగులు సంస్థ ఎండీ: ప్రతాప్
నెడ్ క్యాప్ ఎండీ: ప్రతాప్
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ : షాన్ మోహన్
విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ : శివశంకర్
తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ : లక్ష్మీ షా
గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ : దినేష్ కుమార్
ఆప్కో ఎండీ : హిమాన్షు శుక్లా
సర్వ శిక్ష అభియాన్ ఎస్‌పీడీ: వి.చిన వీరభద్రుడు
సెర్ప్ సీఈవో: రాజాబాబు
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌: మాధవీలత
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్: కృతిక శుక్లా
సహకార శాఖ కమిషనర్ : వాణీ మోహన్
కార్మిక శాఖ కమిషనర్ : వరప్రసాద్
ఏపీఎండీసీ ఎండీ: భానుప్రకాశ్