పడవ బోల్తా..విషాదంగా విహారయాత్ర !

13 January, 2018 - 3:00 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: మహారాష్ట్రలోని దహాను సముద్ర తీరంలో విషాదం నెలకొంది. విద్యార్థులతో వెళ్తున్న పడవ తలకిందులైన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్రలో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు దహను బీచ్‌ నుంచి సముద్రంలోనికి వెళ్లారు. తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంగా.. బోటు ఒక్కసారిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బోటువద్దకు చేరుకుని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే నలుగురు ప్రాణాలు విడిచారు. 32 మంది విద్యార్థులను సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మిగిలిన నలుగురికోసం గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో స్థానిక అధికారులతోపాటు నౌకాదళం కూడా పాలుపంచుకుంది. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.