17 మందిని మింగేసిన మితిమీరిన వేగం

13 June, 2018 - 11:41 AM

(న్యూవేవ్స్ డెస్క్)

మెయిన్‌‌పురి (యుపీ)‌: ఉత్తరప్రదేశ్‌‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెయిన్‌‌పురి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి, గాయపడిన వారందరినీ హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి డివైడర్‌‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.

ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అతి వేగమే కారణమని తెలుస్తోందని పోలీసులు తెలిపారు.