మన్మధుడు ‘కలెక్షన్’

10 August, 2019 - 5:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మధుడు 2. ఈ చిత్రం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి రూ. 5 కోట్ల షేర్ వచ్చింది. అదీకాక ఆగస్టు 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వరుసగా సెలవులు.. ఈ నేపథ్యంలో నాగ్ ఫ్యాన్స‌్‌కి ఇదో మంచి అవకాశం అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అదీకాక… గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మన్మధుడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మన్మధుడు 2 తెరకెక్కింది. ఈ చిత్రంలో సమంతా, కీర్తి సురేశ్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మన్మధుడు చిత్రానికి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 5 కోట్ల షేర్ రావడం ఇక్కడ గమనార్హం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, వియాకామ్ మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

నైజాం – రూ. 1.30 కోట్లు
సీడెడ్ – రూ. 0.48 కోట్లు
వైజాగ్ – రూ. 0.46 కోట్లు
ఈస్ట్ – రూ. 0.35 కోట్లు
వెస్ట్ – రూ. 0.28 కోట్లు
కృష్ణా – రూ. 0.28 కోట్లు
గుంటూరు – రూ. 0.54 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు
నైజాం + ఏపీ (టోటల్) – రూ. 3.86 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – రూ. 0.87 కోట్లు
ఓవర్సీస్ – రూ. 0.30 కోట్లు
మొత్తం : రూ. 5.03 కోట్లు( షేర్)