దేవీ శ్రీప్రసాద్ మూవీ రివ్యూ

24 November, 2017 - 4:49 PM

(న్యూ వేవ్స్ డెస్క్)

ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందు కొచ్చింది. శ్రీ కిషోర్ డైరెక్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో..చూద్దాం.

పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా కమ్రాన్‌ సంగీతం అందించగా, శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌ సంభాషణలందించారు. ఈ సినిమాకు నిర్మాత‌లు : డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్. ఇక క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : శ్రీ కిషోర్‌.

కథ విషయానికి వస్తే…

ఆటో డ్రైవర్ గా జీవితాన్ని గడిపే దేవి(భూపాల్) , మార్చురీ రూమ్ లో బాయ్ గా పనిచేసే శ్రీ(ధన్ రాజ్), టీ షాప్ నడిపే ప్రసాద్( మనోజ్ నందం)… ఈ ముగ్గురు స్నేహితులు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురి జీవితంలోకి లీల(పూజా రామచంద్రన్) అనే హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న లీల ఈ ముగ్గురికీ ఏ స్థితిలో పరిచయం అయింది. ఆ సమయంలో వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చూసిన ఈ ముగ్గురు లీలని ఏం చేశారు.. చివరికీ ఈ ముగ్గురి నుంచి లీల ఎలా బయటపడింది. అనేది మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ చూస్తే-తన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచి అందరినీ అట్రాక్ట్ చేసింది పూజా రామచంద్రన్. సినిమా అంతా స్టెఛ్చర్ పైనే నటించే ఇలాంటి రోల్ ఒప్పుకొని తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న పూజని అభినందించాల్సిందే.

భూపాల్, ధన్ రాజ్ , మనోజ్ నందం కొత్త తరహా పాత్రలతో ఆకట్టుకొని తమ రోల్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. నిజానికి ఈ ముగ్గురు ఇప్పటి వరకూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేశారు. పోసాని కృష్ణ మురళి, వేణు తమ టైమింగ్ తో కామెడీ పండించారు. సుదర్శన్, అవినాష్ కామెడీ పండలేదు పైగా బోర్ కొట్టించారు. మిగతా నటీ నటులందరూ తమ క్యారెక్టర్స్ తో వారి పరిధిలో పరవాలేదనిపించుకున్నారు.

ఇక సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించే. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో థ్రిల్లింగ్ సీన్స్ ను బాగా ఎలివేట్ చేసాడు కమ్రాన్. ఉన్నది ఒకే పాట అయినప్పటికీ వినడానికి బాగుంది. ఫణింద్ర వర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. మాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి, కానీ సన్నివేశాలకి తగినట్లుగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ కలిగించే స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఫరవాలేదు.

సమీక్ష :

గతంలో ‘సశేషం’, ‘భూ’ వంటి సినిమాకు దర్శకత్వం వహించ దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ శ్రీ కిషోర్ తెలుగులో ఇప్పటి వరకు రాని ఓ బోల్డ్ పాయింట్ ను టచ్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించి ప్రయోగాత్మక దర్శకుడు అనిపించుకున్నాడు. ట్రైలర్ లో కనిపించిన బోల్డ్ నెస్ సినిమాలో ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడుతూ తన స్క్రీన్ ప్లే మేజిక్ చేశాడు. నిజానికి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బోల్డ్ అయినప్పటికీ దాన్ని వల్గర్ గా చూపించకుండా కథలో ఇమిడించాడు.

సినిమా ప్రారంభంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, హత్యలను వార్తల రూపంలో చూపిస్తూ కథలో తీసుకెళ్లిన దర్శకుడు స్టార్టింగ్ లో కాస్త బోర్ కొట్టించినా నెమ్మదిగా ప్రేక్షకుడిలో ఇంట్రెస్ట్ కలిగించి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఎంటర్టైన్ చేశాడు. ఇక ఇలాంటి బోల్డ్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకొని 100 % ఎఫర్ట్ పెట్టిన పూజ రామచంద్రన్ ని అభినందించాలి. ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి… జారుతున్నాయి అంటూ ప్రేక్షకులకు సినిమా రూపంలో చూపించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది.

పూజా రామచంద్రన్ పెర్ఫార్మెన్స్, భూపాల్ నెగిటీవ్ షేడ్ క్యారెక్టర్, ధన్ రాజ్ మనోజ్ నందం ఎమోషనల్ క్యారెక్టర్స్, సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లే , ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు హైలైట్స్.. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో కాసేపు బోర్ ఫీలయ్యే సీన్స్, సెకండ్ హాఫ్ లో స్విచువేషన్ లేకుండా వచ్చే సాంగ్, లాజిక్స్ పెద్దగా పట్టించుకోకపోవడం మైనస్. ఫైనల్ గా ఫిక్షన్ డ్రామా థ్రిల్లర్ గా దేవి శ్రీ ప్రసాద్ ఎంటర్టైన్ చేస్తుంది.