గిట్టుబాటు ధర కోసమే రైతు కమిటీలు

13 September, 2017 - 3:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రాజన్నసిరిసిల్లా:  కాంగ్రెస్ నేతలు ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసమే రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు అని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేశామని తెలిపారు.  తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు సరిపోయే నాయకుడు ఎవరూ లేరని తేల్చిచెప్పారు.  కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. రైతు కమిటీలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలకు కోర్టు చివాట్లు పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.   గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు.  రూ. 1024 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు.