‘ఖాకీ’తో నిర్మాతగా ఉమేష్ గుప్తా ఎంట్రీ

13 September, 2017 - 9:21 AM


రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న  ‘ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ తొలిసారి నిర్మాణరంగంలోకి అడుగెడుతోంది. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్‌ గుప్తా నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి చిత్రం ‘ఖాకీ’. కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా ‘ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు’ను ‘ఖాకీ’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌’… అనేది ఉపశీర్షిక. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా ‘ఆదిత్య మ్యూజిక్‌’ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ– ‘‘ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్‌ తీసుకున్నా. తెలుగులో ‘రన్‌ రాజా రన్‌’, ‘జిల్‌’, ‘బాబు బంగారం’, ‘హైపర్‌’ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అతి త్వరలో టీజర్ ను, పాటలను , చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.