క్షమాపణలు చెప్పిన జేసీ

16 June, 2017 - 12:03 PM

టీడీపీ ఎంపీ దివాక‌ర్ రెడ్డి క్షమాప‌ణ‌లు చెప్పారు. గురువారం విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న తర్వాత ఆయ‌న‌పై విమాన సంస్థ‌లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై ఆయ‌న్ను మీడియా ప్ర‌శ్నించింది. ఆ ఘ‌ట‌న ప‌ట్ల మాట్లాడేందుకు నిరాక‌రించిన ఎంపీ దివాక‌ర్ రెడ్డి చేతులు జోడించి సారీ చెప్పారు.
ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి గురువారం విశాఖ విమానాశ్ర‌యంలో బోర్డింగ్ పాస్ జారీ స‌మ‌యం అయిపోవ‌డంతో సిబ్బంది కౌంట‌ర్ మూసేశారు. త‌న‌కు బోర్డింగ్ పాస్ ఇవ్వాల‌ని సిబ్బందితో దివాక‌ర్ రెడ్డి వాద‌న‌కు దిగారు. స‌మ‌యం ముగిసింద‌ని, ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని అక్క‌డి వారు చెప్ప‌డంతో ఆయ‌న ఆగ్ర‌హంతో ఊగిపోయారు. బోర్డింగ్ పాస్ ప్రింట‌ర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ వ్య‌వ‌హారంపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు.