హిమాలయాలకు వెళ్ళిన రజనీకాంత్

10 March, 2018 - 11:59 AM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: ఆధ్యాత్మికత ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తానని కొద్ది రోజుల క్రితమే వ్యాఖ్యానించిన దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లారు. తన చిత్రాల షూటింగ్ పూర్తయిన తరువాత హిమాలయాలకు వెళ్లి వారం పది రోజులు గడిపి వచ్చే ఆయన ‘కాలా’, ‘2.0’ చిత్రాల షూటింగ్ పూర్తి కావడంతో తనకు ఇష్టమైన ప్రాంతాన్ని వెతుక్కుంటూ సామాన్యునిలా బయలుదేరి వెళ్లారు.

సూపర్‌స్టార్‌గా రజనీకాంత్‌కు ఎంత స్టార్‌డమ్ ఉన్నా హిమాలయాలకు ఆయన సాధారణ వ్యక్తిగా వెళతారన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించే ముందు కొంతకాలం బాబా గుహలో ధ్యానంలో గడపాలని రజనీ భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.