కోహ్లీసేనను స్వీపర్లతో పోల్చి…

13 September, 2017 - 2:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భారత్‌తో సిరీస్ ప్రారంభం కంటే ముందే ఆస్ట్రేలియా‌ మైండ్‌గేమ్ మొదలు పెట్టింది. కోహ్లీ సేనను స్వీపర్లతో పోలుస్తూ ఆస్ట్రేలియా జర్నలిస్టు ఒకరు చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. గతేడాది స్వచ్ఛ భారత్‌లో భాగంగా కోహ్లీ సేన కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ గ్రౌండ్‌ను శుభ్రం చేసింది. అయితే అప్పటి ఫొటోను డెన్నిస్‌ ఫ్రీడ్‌మాన్‌ అనే ఆస్ట్రేలియా జర్నలిస్టు తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి ‘ వరల్డ్ ఎలెవన్‌ మ్యాచ్‌ కోసం స్వీపర్లు గ్రౌండ్‌ను శుభ్రం చేసి రెడీ చేస్తున్నారు’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. వరల్డ్ ఎలెవన్, పాకిస్తాన్ జట్ల మధ్య పాక్‌లో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.

దీనిపై టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెన్నిస్‌పై ఎదురుదాడికి దిగారు. ‘అత‌నొక్కడే మీ టీమ్ 7 జ‌న‌రేష‌న్స్‌ను కొని పారేస్తాడ‌ని ఒకరంటే, అవును అతను స్వీపరే.. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ను కూడా అలాగే స్వీప్ చేస్తాడని మరోకరు అన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చెత్తను కోహ్లీ ఊడ్చేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు.