లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

15 May, 2018 - 10:48 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక వైపున ఉత్కంఠ రేపుతున్నాయి. బీజీపే 112 స్థానాల్లో విజయం సాధించి మేజిక్ ఫిగర్ అందుకున్న నేపథ్యంలో స్టాక్‌‌మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి బాగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 420 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి.

మెటల్‌, ఫార్మా, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. పవర్‌‌గ్రిడ్‌, హెచ్‌‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, టాటా స్టీల్‌, టైటన్‌, ఓఎన్‌‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌ 3-1 శాతం లాభపడుతుండగా, టాటా మోటార్స్‌, ఇన్ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఐషర్‌, హెచ్‌‌పీసీఎల్‌, హెచ్‌‌సీఎల్‌ టెక్‌, సిప్లా నష్టాల్లో కొనసాగుతున్నాయి.