పోస్ట్ ప్రొడక్షన్ దశలో ‘సాగరతీరంలో..’

11 May, 2018 - 12:41 PM

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్‌గా సీనియర్ నటులు వినోద్, నరేంద్ర, హాస్యనటులు అంబటి శ్రీను, నామాల మూర్తి, రంగస్థలంలో నెగటివ్ రోల్ పోషించిన పవన్ సురేష్, యువ నటులు ఉదయ్ పులిమే, సూర్యతేజ సుంకర, సిద్దు రాయవురెడ్డి ముఖ్య పాత్రలో ధర్మారావు జగతా దర్శకత్వంలో తాడాల వీరభద్రరావు నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘సాగరతీరంలో ‘…

కోనసీమ పరిసర ప్రాంతాలైన అమలాపురం, ముమ్మిడివరం, పాండిచ్చేరి యానాంతో పాటు నత్తారామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీర ప్రాంతాల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది.ఈ సందర్భంగా నిర్మాత వీరభద్రరావు మాట్లాడుతూ.. ‘మా సాగరతీరంలో.. యువతరానికి కనెక్ట్ అయ్యే అందమైన ప్రేమకథ. నవ్వులు పంచే కామెడి, భయపెట్టే హారర్, థ్రిల్‌కు గురిచేసే సస్పెన్స్‌తో పాటు దేశభక్తి మిళితమైన క్లీన్ ఎంటర్టైనర్’ అని తెలిపారు.

దర్శకుడు ధర్మారావు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ముస్తాబు చేస్తున్నాం. ఎడిటింగ్ పూర్తిచేసుకుని డబ్బింగ్ తుది దశలో ఉంది. మిగిలిన వర్క్ కూడా త్వరలోనే పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తాం’ అన్నారు.

తమ సినిమా త్వరగా పూర్తికావడానికి సహకరించిన యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేక కృతఙ్ఞతలు అని సహనిర్మాతలు శశికళ, రామలింగప్రసాద్ చెప్పారు.కథా రచయిత శ్రీనివాస్ జగతా మాట్లాడుతూ.. ‘మా మైండ్‌లో ఉన్న విజువల్స్‌ని ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత మా కెమెరామన్ కిషన్‌సాగర్ ఎంతో అందంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సంగీత దర్శకుడు భోలే అద్భుతమైన ఆరు పాటలు అందించారు. సినిమా విజయంలో సంగీతం ముఖ్య పాత్ర పోషిస్తుంద’న్నారు.

బొమ్మిరెడ్డి ప్రసాదు, గుర్రం రామకృష్ణారావు బెన్నీ, గనిశెట్టి స్కందన్, భలే చాన్సులే శ్వేతా, చైతన్య మోటూరి, అమర్, వీరు, గాడం రాజేష్, శేఖర్ గోకాడ, చారు శ్రీ, భానుమతి, లాస్య తాడాల, బేబీ ఆరాధ్య జగతా తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: ధర్మారావు జగతా, నిర్మాత: తాడాల వీరభద్రరావు, సహ నిర్మాతలు: తాడాల శశికళ, నార్ని రామలింగప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, చీఫ్ అసోసియేట్: జగతా శ్రీనివాస్, కో డైరెక్టర్: నాని బాబు, డిఒపి: కిషన్‌సాగర్, సంగీతం: భోలే, ఎడిటింగ్: శివ శార్వాణి, డాన్స్: బెన్నీ (ఆట ), ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్: నారాయణ, కాస్ట్యూమ్స్: పేర్ని రాంబాబు, మేకప్ చీఫ్: మామిడిపల్లి శ్రీను, లిరిక్స్: భోలే, సాయి సిరి, దాట్ల, తాడాల శశికళ, గరుగు శ్రీనివాస్.