‘రియల్ దండుపాళ్యం’ ట్రైలర్ విడుదల

13 June, 2018 - 4:52 PM

శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పించు చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్వివేది, మేఘనరాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ నటించగా.. సి. పుట్టుస్వామి నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రం యూనిట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. కన్నడలో ఇదివరకే వచ్చిన దండుపాళ్యానికి, ఇప్పుడు నా డైరెక్షన్‌లో వస్తున్న ఈ రియల్ దండుపాళ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండు చిత్ర కథలకు ఏమాత్రం సంబంధం లేదు. 1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఎలా జరిగిందో అలానే సినిమాలో చూపించాం. ఇందులో ఐదుగరురు హీరోయిన్స్, ఇద్దరు హీరోలు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ నేను కలసి కన్నడలో 9 సినిమాలు చేశాం. అన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రానికి కూడా తానే ఉండాలనే ఉద్దేశ్యంతో శ్రీధర్‌ను తీసుకున్నాం. నిర్మాత పుట్టుస్వామి, చలపతిల సహకారంతోనే ఈ చిత్రం ఇంతవరకు వచ్చింది. వారికి నా కృతఙ్ఞతలు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంద’ని అన్నారు.నిర్మాత పుట్టుస్వామి మాట్లాడుతూ… తెలుగులో ఇదివరకే 3 సినిమాలు చేశాను. అన్నీ విజయవంతం అయ్యాయి. నా బ్యానర్ నుంచే విడుదల చేశాను. మొదటిసారి ఇతర బ్యానర్ నుంచి రియల్ దండుపాళ్యం చిత్రాన్ని చేస్తున్నా. ఎవరూ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ వచ్చాడు. సినిమా పూర్తయ్యాక చూస్తే.. నేనే థ్రిల్ అయ్యా. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. కన్నడలో పెద్ద హీరోయిన్స్ కూతుర్లే ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్. చాలా బాగా నటించారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఏర్పడిన చర్యను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ రియల్ దండుపాళ్యం కాన్సెప్ట్. సందేశాత్మక చిత్రం కనుక తెలుగు, కన్నడ భాషల్లో ఈ నెల ఆఖరున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మ్యూజికల్ స్పేస్ ఉన్న చిత్రం ఇది. ఔట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. దర్శక నిర్మాతలు నాకు ఫ్రీడమ్, నమ్మకం ఇచ్చారు. సింగర్స్ అద్భుతంగా పాడారు. హిట్ అవుతుందని భావిస్తున్నా’ అని చెప్పారు.

హీరో యువరాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, భారతీబాబు, సుమిత్ర, మూర్తి, రఘు బట్, పద్మావసంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాగిణి ద్వివేది, మేఘనరాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్. వి. సభ్రం, మాటలు-పాటలు: భారతి బాబు, పివిఎల్ఎన్ మూర్తి, నిర్మాత: సి. పుట్టుస్వామి, డైరెక్టర్: మహేష్.