‘అరణ్య’ రెండో షెడ్యూల్ పూర్తి

05 June, 2018 - 3:35 PM

విలక్షణ న‌టుడు రానా ద‌గ్గుబాటి, నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రభు సాల్మన్ కాంబినేష‌న్‌‌లో రూపొందుతోన్న త్రిభాషా చిత్రం `అర‌ణ్య`. కెరీర్ ప్రారంభం నుంచీ విల‌క్షణ‌మైన పాత్రలు, వైవిధ్యమైన క‌థాంశాలున్న చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న యువ క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి. ఈయ‌న ప్రస్తుతం భారీ బ‌డ్జెట్‌, గ్రాఫిక్స్‌‌తో రూపొందుతోన్న త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్నారు. ఆ చిత్రమే `హాథీ మేరే సాథీ`.

చిత్ర నిర్మాణ సంస్థల్లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ‌క్షన్ హౌస్‌‌గా పేరున్న ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం. ఈ మూవీలో రానా ద‌గ్గుబాటి, పుల్కిత్ సామ్రాట్‌, విష్ణువిశాల్‌, జోయా హుస్సేన్‌, క‌ల్కి కోచ్లిన్ ప్రధాన తారాగ‌ణం. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రభుసాల్మన్ తెలుగు, హిందీ, త‌మిళంలో ఒకేసారి సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం.

1971లో విడుద‌లైన బాలీవుడ్‌ క్లాసిక్ మూవీ `హాథీ మేరే సాథీ` స‌హా కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళంలో `కాడ‌న్‌`, తెలుగులో `అర‌ణ్య` పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. మ‌నిషి.. జంతువుల‌కు మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో హైలైట్‌‌గా చూప‌నున్నారు.

రానా ద‌గ్గుబాటి, జోయ‌, కల్కి మూడు భాష‌ల్లోనూ న‌టిస్తుంటే హిందీలో పుల్కిత్ సామ్రాట్ చేసే పాత్రను త‌మిళఃలో విష్ణు విశాల్‌, తెలుగులో ర‌ఘుబాబు చేస్తున్నారు. శాంత‌ను మొయిత్రా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ర‌సూల్ వూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు.

ఏనుగులు వివిధ సంద‌ర్భాల్లో చేసే శ‌బ్దాల‌ను అర్థం చేసుకోవ‌డానికి రానా థాయ్‌‌లాండ్‌‌లో 50 రోజుల వ‌ర్క్‌‌షాప్‌‌కి హాజరయ్యారు. ఈ సినిమా కోసం ఆయ‌న ప‌దిహేను కిలోల బ‌రువు త‌గ్గడం విశేషం. భారీ స్కేల్‌, బ‌డ్జెట్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌‌తో సినిమాను థాయ్‌‌లాండ్‌, కేర‌ళ‌లో చిత్రీక‌రిస్తున్నారు.

ఈరోస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ.. `మ‌నుషులు జంతువుల‌ మ‌ధ్య ఉండే అనుబంధాన్ని తెలియ‌జేసే ట్రూ ఫిలిం మాది. ప్రకృతి అందాల న‌డుమ సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నాం. మూడు భాష‌ల్లో సినిమా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అన్నారు.

ద‌ర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ..`నా ఫేవ‌రెట్ స‌బ్జెక్ట్‌. ఏనుగుల మ‌ధ్య షూటింగ్ చేయ‌డానికి ఇష్టప‌డ‌తాను. మా అనుభ‌వాల‌ను ప్రేక్షకుల‌తో పంచుకోవ‌డానికి చాలా ఆస‌క్తిగా ఉన్నాం` అన్నారు.