రాజ్‌తరుణ్ ‘రాజుగాడు’ జూన్ 1న రిలీజ్

09 May, 2018 - 2:20 PM

యంగ్ హీరో రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘రాజుగాడు” చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన సక్సెస్‌ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ ఆసక్తి నెలకొంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్‌తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ఇటీవలే విడుదలైన మొదటి పాట సంగీత ప్రియులను అలరిస్తోంది. సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. రాజుగాడు ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ మే మూడవ వారంలో నిర్వహిస్తారు.తారాగణం: రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృథ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యూమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు.

కథ: ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంజనా రెడ్డి.