‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ ఫస్ట్‌లుక్ రిలీజ్

10 June, 2018 - 5:44 PM

జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మాస్ మహారాజ రవితేజ ఆవిష్కరించారు.

ఈ సందర్భంలో హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘చిత్ర హీరో హరి చాలా బాగా డాన్స్‌లు చేశాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అతనికి అతని హైటు ప్లస్. ఈ సినిమా పాటలు, ట్రైల, కొన్ని సీన్స్ చూశాను. హరి చాలా బాగా నటించాడు. అతను భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తప్పకుండా వెళ్తాడు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావుతో నాకు మంచి అనుబంధం ఉంది. అతనికి ఈ సినిమా మంచి విజయంతో పాటు డబ్బులు కూడా తెస్తుంది అనే నమ్మకం ఉంది. సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘నాకు ఎంతో ఇష్టమైన హీరో రవితేజ. మా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కొన్ని పాటలు, కొన్ని సన్నివేశాలు రవితేజకు చూపించాం. మా అబ్బాయి హరిని రవితేజ అభినందించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సినిమా మొత్తం పూర్తయ్యింది. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేయనున్నాం. ఈ నెల చివరి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి’ అని చెప్పారు.హీరో హరి మాట్లాడుతూ.. ‘నేను హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రవితేజ రిలీజ్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. సినిమా బాగా వచ్చింది. డాన్స్ పరంగా, నటన పరంగా రవితేజ నన్ను మెచ్చుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. త్వరలోనే ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ప్రేక్షకులు నా ప్రయత్నాన్ని మెచ్చి నన్ను దీవిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.

హరికృష్ణ జొన్నలగడ్డ, (తొలిపరిచయం), అక్షిత, ఝాన్సీ, చిలుకూరి గంగారావు, ఏఆర్‌సి బాబు, రాహుల్ బొకాడియా, పింగ్ పాంగ్, రాఘవ పూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జెఎస్ఆర్ మూవీస్, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, సంగీతం: యాజమాన్య, పాటలు: వనమాలి, గోసాల రాంబాబు, ఎడిటర్: జానకీరామ్, కో-డైరక్టర్: వి.సిప్పి, కెమెరా: పి.ఎస్ వంశీ ప్రకాశ్, స్టంట్స్: రామ సుంకర, కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్, విద్యా సాగర్, నిర్మాత: సావిత్రి జొన్నలగడ్డ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు.