24 పైసలు తగ్గిన పెట్రోల్ ధర

10 June, 2018 - 11:19 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: వినియోగదారులకు మొన్నటి దాకా చుక్కలు చూపించిన పెట్రోల్‌ ధరలు వరుసగా పన్నెండో రోజు ఆదివారం కూడా తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌‌పై ఢిల్లీ, కోల్‌‌కతాలలో ఆదివారం 24 పైసలు తగ్గాయి. చెన్నైలో 26 పైసలు, ముంబైలో 23 పైసలు తగ్గింది. వరుసగా పన్నెండో రోజు కూడా తగ్గడంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.76.78, ముంబైలో రూ.84.61 గా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పెట్రోల్‌ ధరలు లీటరుపై ఢిల్లీలో రూ.1.65, కోల్‌‌కతాలో రూ.1.62, ముంబైలో రూ.1.63, అత్యధికంగా చెన్నైలో రూ.1.74 తగ్గింది.

డీజిల్‌ ధరలు కూడా ఆదివారం 18 పైసలు వరకూ తగ్గాయి. ముంబై, చెన్నైలో 19 పైసలు తగ్గాయి. దీంతో లీటరు డీజిల్‌ ధర రూ. 68.10, కోల్‌‌కతాలో రూ.70.65, ముంబైలో రూ. 72.51, చెన్నైలో రూ. 71.89కు చేరింది. శనివారంనాడు రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్‌‌పై 40-42 పైసలు తగ్గిన విషయం తెలిసిందే.