‘నివాసి’ రెండో షెడ్యూల్ 17 నుంచి

15 April, 2018 - 4:07 PM

‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ వంటి మంచి చిత్రంలో న‌టించి అంద‌రి హృద‌యాల్లో న‌టుడిగా మంచి స్థానం సంపాయించిన శేఖ‌ర్‌వ‌ర్మ హీరోగా, వివియా, విద్య హీరోయిన్స్‌‌గా, స‌తీష్ రేగ‌ళ్ళని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. గాయ‌త్రి ప్రొడ‌క్షన్స్, ద‌త్తాత్రేయ ఎంట‌ర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యాన‌ర్స్‌‌లో కె.ఎన్‌.రావు, టి.వి.వి.ఎస్‌.ఎన్. వ‌ర్మలు నిర్మాత‌లుగా సంయుక్తంగా ‘నివాసి’ మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఏప్రిల్ 17 నుండి రెండో షెడ్యూల్ ప్రారంభిస్తారు. ఒక ఫ్యామిలి యాక్షన్ థ్రిల్లర్‌గా నివాసి తెర‌కెక్కుతోంది. ట్రావెల్ బేస్డ్ స్టోరి. చ‌ర‌ణ్- అర్జున్ సంగీత ద‌ర్శకులు. రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌హా మొత్తం చిత్రం పూర్తయింది. త్వర‌లో పోస్ట్ ప్రొడ‌క్సన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు స‌తీష్ రేగ‌ళ్ళ మాట్లాడుతూ.. ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమాలో శేఖ‌ర్‌వ‌ర్మ చాలా ఎమోష‌న్‌గా ఉండే పాత్ర, అదీ కాకుండా చాలా చ‌క్కగా న‌టించి, అంద‌ర్నీ మెప్పించారు. ఆ త‌రువాత నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన జ‌య‌సింహ చిత్రంలో చాలా చ‌క్కటి పాత్రలో న‌టించి మెప్పించారు. న‌టుడిగా చాలా మంచి మార్కులు వేసుకున్న శేఖ‌ర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ రాశాను. చాలా చ‌క్కటి ఎంట‌ర్‌‌టైన‌ర్‌గా చేస్తున్నాం. అంతేకాదు మంచి ఫ్యామిలి ఎమోష‌న్‌తో కూడిన థ్రిల్ కూడా ప్రేక్షకులు ఫీలయ్యేలా క‌థ‌నం ఉంటుంది. నిర్మాత‌లు కె.ఎన్‌.రావు, వ‌ర్మ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెర‌కెక్కించ‌డంలో స‌హాయం అందిస్తున్నారు. 75 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. క్లైమాక్స్, రెండు పాట‌లు మిన‌హా సినిమా పూర్తయింది. ఏప్రిల్ 17 నుండి రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇటీవ‌ల మేం విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందాన్నిచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వర‌లో విడుద‌లకి స‌న్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.బ్యాన‌ర్స్‌: గాయ‌త్రి ప్రొడ‌క్షన్స్ అండ్ ద‌త్తాత్రేయ ఎంట‌ర్‌‌టైన్‌‌మెంట్స్‌, న‌టీన‌టులు: శేఖ‌ర్ వ‌ర్మ, వివియా, విద్య, సుద‌ర్శన్‌, జె.పి (త‌మిళ్‌), కోటేశ్వరరావు త‌దిత‌రులు. కొరియోగ్రఫి: భాను మాస్టర్‌, ప్రసాద్ మాస్టర్‌, మ్యూజిక్‌: చ‌ర‌ణ్‌- అర్జున్‌, సినిమాటోగ్రఫి: కె.చిట్టిబాబు, ఆర్ట్‌: ముర‌ళి వీర‌వ‌ల్లి, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, ఎడిటింగ్‌: ప్రతాప్, స్టంట్స్‌: ష‌యెలిల్ మ‌ల్లేష్, నిర్మాత‌లు: కె.ఎన్‌.రావు, టి.వి.వి.ఎస్‌.ఎన్. వర్మ, ద‌ర్శక‌త్వం: స‌తీష్ రేగ‌ళ్ళ.