తేజ్‌ను పెళ్లిచేసుకుంటానంటున్న నాగశౌర్య

13 September, 2017 - 12:39 PM


రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘నెం1 యారి’ కార్యక్రమంలో ప్రతివారం సెలబ్రెటీ ఫ్రెండ్స్ అతిథులుగా వస్తుంటారు. ఒక్కోసారి సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఈ కార్యక్రమంలో సెలబ్రెటీలు పాల్గొన్న సంధర్భాలు కూడా వున్నాయి. సెప్టెంబర్ 15న ‘కథలో రాజకుమారి’ సినిమా విడుదల కానున్న సంధర్భంగా.. ఈ సినిమాలో హీరోలుగా నటించిన నాగశౌర్య, నారా రోహిత్‌లు ‘నెం1 యారి’ షోకి విచ్చేసారు. బయట కూడా మంచి స్నేహితులైన వీరిద్దరి గురించి ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడనున్నాయి.

నాగశౌర్య ఒంటిమీద బట్టల్లేకుండా పడుకుంటాడట అనే ప్రశ్నకు నారా రోహిత్ నిజమే అని అనిపించే విధంగా తన హవభావాలతో చెప్పుకొచ్చాడు. అలాగే ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అని రానా ఓ ప్రశ్న అడగగా… సాయిధరమ్‌తేజ్‌ను పెళ్లి చేసుకుంటానని నాగశౌర్య చెప్పుకొచ్చాడు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సరదా విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియనున్నాయి. నాగశౌర్య, నారా రోహిత్ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 17న ప్రసారం చేయనున్నారు.