23న ప్రణబ్‌కు ఎంపీల వీడ్కోలు

15 July, 2017 - 9:56 AM


(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్‌ పదవీకాలం ఈ నెల 25తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఎంపీలు ఈ నెల 23న సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకనున్నారు. ఇందుకోసం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందులో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రణబ్‌కు ఓ జ్ఞాపికతోపాటు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా సంతకం చేసిన పుస్తకాన్ని బహూకరిస్తారు. అనంతరం సెంట్రల్‌హాల్‌ ఆవరణలో తన గౌరవార్థం ఏర్పాటుచేయనున్న తేనీటి విందులో ప్రణబ్‌ పాల్గొంటారు.