`మ‌హిళా క‌బ‌డ్డి` ఫ‌స్ట్ సాంగ్ లాంచ్‌

13 March, 2018 - 5:23 PM

ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ స్వీయ ద‌ర్శక‌త్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం `మ‌హిళా క‌బ‌డ్డి`. ర‌చన స్మిత్ ప్రధాన పాత్రలో న‌టిస్తోంది. ఇటీవ‌లే మూడ‌వ‌ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కోసం ఉగాది పండుగపై ఒక ప్రత్యేక పాట‌ను సంగీత ద‌ర్శకుడు బోలే షావ‌ళి సంగీత సార‌థ్యంలో రూపొందించారు. ఈ పాట‌ను ఉగాది పండుగ సంద‌ర్భంగా ఫిలిం చాంబ‌ర్‌లో `మా` అధ్యక్షుడు శివాజీరాజా చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ…`ఆర్.కె.ఫిలింస్ అంటే నా సొంత బేన‌ర్ లాంటిది. నా కెరీర్ ప్రారంభ ద‌శ‌లో ఈ బేన‌ర్‌లో నటించాను. అప్పటి నుంచీ మా ఇద్దరి మ‌ధ్యా మంచి సాన్నిహిత్యం ఉంది. ఉగాది పండుగ సంద‌ర్భంగా ఉగాది పండుగపై చేసిన పాటను నేను లాంచ్ చేయ‌డం చాలా ఆనంద‌గా ఉంది. బోలే షావ‌ళి అద్భుతంగా రాసి, కంపోజ్ చేయ‌గా వ‌రం అనే నూత‌న గాయ‌ని ఎంతో విన‌సొంపుగా పాడింది. ఈ పాట‌తో ఉగాది పండుగ ముందే వ‌చ్చిన‌ట్టు అనిపిస్తోంది. ఈ పాట‌లా సినిమా కూడా అద్భుతంగా ఉండ‌బోతుంద‌ని అర్థమ‌వుతోంది` అన్నారు.ద‌ర్శక నిర్మాత ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ… `మా బేన‌ర్‌లో చాలా గ్యాప్ త‌ర్వాత నేను ద‌ర్శకత్వం వ‌హిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రంలోని ఉగాది పండుగపై వ‌చ్చే ప్రత్యేక పాట‌ను బోలే రాసి, కంపోజ్ చేయ‌గా వ‌రం అనే నూత‌న గాయ‌ని అద్భుతంగా ఆలపించింది. మ‌హిళ‌లు ఎందులోనూ త‌క్కువ కాద‌నే కాన్సెప్ట్‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నాం. ఒక ప‌ల్లెటూరు అమ్మాయి భార‌త‌దేశం గ‌ర్వప‌డే స్థాయిలో క‌బ‌డ్డీ ఛాంపియ‌న్‌గా ఎలా ఎదిగింద‌నేది మెయిన్ క‌థాంశం. ర‌చ‌న స్మిత్ టైటిల్ రోల్‌లో న‌టిస్తున్నారు. శివాజీరాజా కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మా బేన‌ర్ తొలి హీరో అయిన శివాజీరాజా చేతుల మీదుగా మా చిత్రంలోని తొలి పాట లాంచ్ చేయ‌డం చాలా సంతోషం. మా చిత్రంలో ఫేమ‌స్ సింగ‌ర్ మంగ్లి కూడా ఒక పాడ పాడారు. రాజ్ కిర‌ణ్ కంపోజ్ చేసిన ఆ పాట‌ను ఉగాది పండుగ త‌ర్వాత రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం` అని చెప్పారు.

తెలుగు ఫిలిం చాంబ‌ర్ సెక్రట‌రీ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. `ఉగాదిపై చేసిన పాట యుగాది పండుగలా అద్భుతంగా ఉంది. యూనిట్ అంద‌రికీ శుభాకాంక్షలు` అన్నారు. ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ… `చిన్న చిత్రాల‌ను ఆద‌రించే ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ చేస్తోన్న ప్రయ‌త్నం ఫలించాలి. టైటిల్ లాగే పాట అద్భుతంగా ఉంద‌ి`అని హర్షం వ్యక్తం చేశారు. సింగ‌ర్ వ‌రం మాట్లాడుతూ… `ఈ చిత్రంలో ఒక మంచి పాట‌ పాడే అవ‌కాశం క‌ల్పించిన ప్రతాని రామ‌కృష్ణకు, బోలే షావళికి ధ‌న్యవాదాలు` అని చెప్పారు. సంగీత ద‌ర్శకుడు బోలే షావ‌ళి మాట్లాడుతూ… `ఉగాది పండుగపై పాట రాసి, కంపోజ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ప్రతానికి ధన్యవాదాలు` అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫ‌ర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.