‘భరత్ అనే నేను’కు భారీ డిమాండ్

30 August, 2017 - 10:06 AM


‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫస్ట్‌లుక్, టీజర్‌ విడుదల కాకముందే సినిమాకు భాకీ డిమాండ్ ఏర్పడింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర థియేటర్ రైట్స్‌ను సొంతం చేసుకోవడానికి భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో విడుదల చేస్తుండటంతో అక్కడ కూడా సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ విషయంపై ఇంకా నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మహేష్ నటిస్తున్న మరో చిత్రం ‘స్పైడర్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.