దినకరన్ వర్గం ఎమ్మెల్యేకు కోర్టు చివాట్లు

11 September, 2017 - 12:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశం జరగకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యే పి.వెట్రివేల్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి హైకోర్టును కాకుండా, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించింది. సమావేశానికి వెళ్లడం ఇష్టం లేకపోతే… ఇంట్లో కూర్చోవాలని చురక అంటించింది. కోర్టు సమయాన్ని వేస్ట్ చేసినందుకు లక్ష రూపాయల జరిమానా  చెల్లించాలని వెట్రవేల్ ను ఆదేశించింది.

ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని పదవి నుంచి దించేందుకు శశికళ-దినకరన్‌ వర్గం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలతో దినకరన్‌ క్యాంపు నిర్వహిస్తున్నారు. వీరంతా సోమవారం బెంగళూరు జైలులో ఉన్న శశికళను కలుస్తారని ప్రచారం జరుగుతోంది.