జాదవ్ కేసులో మళ్లీ భారత్- పాక్ వాదనలు

12 September, 2017 - 8:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భార‌త నేవీ మాజీ అధికారి కుల్ భూష‌ణ్ జాదవ్‌ కేసులో బుధవారంనాడు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాకిస్తాన్ మరోసారి తమ వాదనలు వినిపించనున్నాయి. గూఢచర్యం ఆరోప‌ణ‌లు మోపుతూ కుల్ భూష‌ణ్ జాదవ్‌‌కి పాకిస్తాన్ ఆర్మీ కోర్టు మ‌ర‌ణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త్ అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానానికి వెళ్లి ఆయన మ‌ర‌ణ‌శిక్షపై స్టే తెచ్చుకుంది. అయితే అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో ఈ కేసు బుధవారం మ‌రోసారి విచార‌ణ‌కు రానుంది.

కుల్ భూషణ్ జాదవ్ కేసులో ఇరు దేశాలు తాము చేస్తోన్న వాద‌న‌లపై ఆధారాలు స‌మ‌ర్పించాక వాటిని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం క్షుణ్ణంగా ప‌రిశీలిస్తుంది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ఈ ఏడాది డిసెంబ‌రులో ఇవ్వనుంది.