ఎన్టీఆర్‌ను చూసి కంగారుపడ్డ ప్రణతి

11 September, 2017 - 12:36 PM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై, లవకుమార్, కుశ పాత్రలలో నటించిన ‘జై లవకుశ’ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 10న శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సినిమాలోని జై పాత్ర కోసం ఎన్టీఆర్ పడ్డ కష్టం మాములు కాదని… జై పాత్రలో ఉండిపోయి.. ఓ క్షణంలో తన కాలుకి గాజుముక్క కుచ్చుకున్న విషయం కూడా మరచిపోయి అలాగే అర్థరాత్రి సమయంలో నత్తితో మాట్లాడుతూ జై పాత్రలో ఒదిగిపోవడానికి చాలా కష్టపడ్డాడు. తన కష్టం చూసిన తారక్ భార్య ప్రణతి కంగారుపడిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. కానీ తారక్ పడిన కష్టమేంటో, డెడికేషన్ ఏంటో జై క్యారెక్టర్ చూస్తేనే తెలిసిపోతుంది. తారక్ చేసినట్లుగా ఎవరూ ఆ నత్తి క్యారెక్టర్ చేయాలేరు.. ఇది నా ఛాలెంజ్ అంటూ కళ్యాణ్‌రామ్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సినిమాతో తారక్‌కు నేషనల్ అవార్డు వస్తుందనే నమ్మకం వుందని కళ్యాణ్‌రామ్ చెప్పుకొచ్చాడు.

ఇక బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన ‘జై లవకుశ’ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. రాశిఖన్నా, నివేధా థామస్ హీరోయిన్లుగా నటించారు.