భారత్ పర్యటనకు జ‌పాన్ ప్ర‌ధాని

13 September, 2017 - 9:31 AM


(న్యూవేవ్స్ డెస్క్)

అహ్మ‌దాబాద్: జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. బుధవారం ఆయ‌న గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ వెళ్లి.. అక్కడ అహ్మ‌దాబాద్ – ముంబై మ‌ధ్య తొలి హైస్పీడ్ రైలు ప‌నుల ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాని మోదీతో క‌లిసి రోడ్ షోలో పాల్గొని స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించ‌నున్నారు. అహ్మ‌దాబాద్‌లోని సిద్ది స‌య్య‌ద్ మసీదును కూడా ఇద్ద‌రు ప్ర‌ధానులు సంద‌ర్శించ‌నున్నారు. ఇద్దరు ప్రధానుల పర్యటన నేపథ్యంలో అహ్మ‌దాబాద్ మొత్తం స‌ర్వాంగ సుంద‌రంగా త‌యారైంది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా షింజో అబే మంగ‌ళ‌వార‌మే భార‌త్ చేరుకున్నారు. అహ్మాదాబాద్‌, గాంధీన‌గ‌ర్‌లో ఇవాళ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. రెండు సిటీల్లోనూ భారీ ఎత్తున స్వాగ‌త హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జ‌పాన్‌తో భార‌త్ మొత్తం 15 ఒప్పందాలు కుదుర్చుకోనున్న‌ది.