తెలంగాణను ఆదర్శంగా తీసుకోండి

13 September, 2017 - 12:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసినందుకు కేసీఆర్ కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అమలు చేస్తుందని ఆశిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.