‘రౌడీపోలీస్’గా నికిషా పటేల్..

11 February, 2018 - 4:58 PM

పవన్ కల్యాణ్ పులి సినిమాతో పరిచయమైన బ్యూటీ నికిషా పటేల్. అలరించే అందం.. ఆకట్టుకునే అభినయం నికిషా సొంతం. అయితే కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో అలరించిన నికిషా ఇప్పుడు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీతో రాబోతోంది. ఈ సినిమాలో నికిషా పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్ కూడా ‘రౌడీపోలీస్’ అని పెట్టారు. టైటిల్‌తో పాటు నికిషా పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. రౌడీపోలీస్‌లో ముకుల్‌దేవ్ విలన్‌గా నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ రోల్‌లో సీనియర్ హీరో భానుచందర్ నటిస్తుండటం విశేషం.

సినిమా కథను బట్టి యాక్షన్ ఎపిసోడ్స్‌కు చాలా స్కోప్ ఉంటుంది. రిస్కీగా సాగే రోప్ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. వాటిని ఎలాంటి డూప్ లేకుండా అత్యంత రియలిస్టిక్‌గా చేసింది హీరోయిన్ నికిషా. సినిమా కోసం కాదు కానీ ఆల్రెడీ నికిషా మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయిన్ అయి ఉంది. పైగా ఆమె రియల్‌గా బాక్సర్ కూడా. కాబట్టి ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చాలా ఈజీగా చేసేసింది.

అంతేకాదు.. ఇకపై ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని నికిషా చెబుతోంది. దర్శకుడు జానీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని ఆర్.ఎ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వేణు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.నటీనటులు: నికిషా పటేల్, భానుచందర్, ముకుల్‌దేవ్, అమిద్, గబ్బర్‌సింగ్ విలన్ బ్యాచ్, సాంకేతిక నిపుణులు: సమర్పణ: బాజీ, బ్యానర్: ఆర్.ఎ ఆర్ట్ ప్రొడక్షన్స్, సినిమాటోగ్రఫీ: ముజీర్, నిర్మాత: వేణు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జానీ.