మోదీపై దిగ్విజయ్ వివాదాస్పద ట్వీట్

08 September, 2017 - 4:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. మోడీ, ఆయన అనుచరులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో రెండు వ్యాఖ్యలు గల ఓ ఫోటో‌ను పోస్ట్ చేసి ట్విట్టర్‌లో మంటపెట్టారు. ఆ ఫోటోలో ప్రధాని మోదీ తాను రెండు ఘనతలు సాధించానని చెప్పుకున్నట్లుగా ఉండే వ్యాఖ్యలు ఉన్నాయి. అందులో ఒకటి భక్తులను పిచ్చోళ్లను చేశాను.. రెండోది పిచ్చోళ్లను భక్తులను చేశాను.

“ఇది తనది కాకపోయినా.. పోస్ట్ చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నా. ఈ ఫోటోలోని వ్యక్తికి క్షమాపణలు. కానీ ప్రజలను పిచ్చోళ్లను చేయడంలో ఈయన దిట్ట” అని దిగ్విజయ్ కామెంట్ కూడా చేశారు. ఈ అసభ్యకర ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దిగ్విజయ్ తీరుపై బీజేపీ తీవ్రంగా మండిపడుతున్నది.