218 పేర్లతో కర్ణాటక కాంగ్రెస్ జాబితా

16 April, 2018 - 11:25 AM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే 218 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదలైంది. ఆ పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి జాబితాను విడుదల చేసింది. మొత్తం 224 సీట్లకు గానూ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ సహా ఈ జాబితాలో ఉన్నారు. సిట్టింగ్‌ స్థానం వరుణతో పాటు చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం మొదట నిర్ణయించారు.

అయితే ఈ జాబితా ప్రకారం సిద్దరామయ్య చాముండేశ్వరి నుంచి, ఆయన చిన్న కుమారుడు యతీంద్ర వరుణ నియోజవర్గం నుంచి బరిలో దిగనున్నారు. కొరట్‌‌గెరె నుంచి గత ఎన్నికల్లో ఓడిన పరమేశ్వరన్‌ మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయనున్నారు.కాగా.. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వివాదాస్పద వ్యాపారవేత్త అశోక్‌ ఖెనీ బీదర్‌ (దక్షిణం) నుంచి సీటు సంపాదించారు. మల్లికార్జున ఖర్గే కుమారుడు చితాపూర్‌ (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు.