హాట్ డ్రెస్‌లో లాస్య రొమాంటిక్ డాన్స్

13 September, 2017 - 11:52 AM


అల్లరి చేస్తూ, తన సరదా సరదా మాటలతో అలరించిన లాస్య ఇటీవలే పెళ్లిచేసుకొని.. టీవి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటివరకు హోమ్లీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న లాస్య.. ఒక్కసారి హాట్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తీసిన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్‌కు సంబంధించి ప్రముఖ ఈటీవి ఛానెల్లో ‘సై సై సైయ్యారే’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాఘవేంద్రరావు తీసిన పాటల్లోని కొన్ని పాటలకు పలువరు నటీనటులు అక్కడ డాన్స్ చేసి అలరిస్తారు. ఇటీవలే హేభ పటేల్, చందు మొండేటీ పాల్గొన్న సెప్టెంబర్ 12న ప్రసారమైన ఈ కార్యక్రమంలో అల్లరి మొగుడు సినిమాలోని ‘రోజ్ రోజ్..’ అంటూ సాగే పాటకు లాస్య, రితేష్ కలిసి డాన్స్ చేసారు.

ఈ పాటలో లాస్య ఓ హాట్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చి, రొమాంటిక్ డాన్స్‌తో రెచ్చగొట్టేసింది. డాన్స్ పరంగా బాగా చేసినప్పటికీ.. అలాంటి డ్రెస్‌లో లాస్య ప్రేక్షకులను అలరించడం తొలిసారి అనే చెప్పుకోవాలి. అయితే లాస్య ఈ డ్రెస్‌లో కూడా ఎక్కడా వల్గారిటీ ప్రదర్శించకుండా.. పాట మేరకు గ్లామర్‌ను పండించింది. మొత్తానికి తన అల్లరి అభినయంతో ఆకట్టుకుంది.