గుర్మీత్‌ సెక్స్‌ లేకపోతే ఉండలేడు : డాక్టర్లు

14 September, 2017 - 5:19 PM

(న్యూ వేవ్స్ డెస్క్)

గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ గురించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. ఇప్పటి వరకు ఆయన డేరా సచ్చా సౌదా ఆశ్రమంలో సోదాలు నిర్వహించగా బాబా అవినీతి బాగోతమంతా బయటపడింది. భూ దందాలు..వేల కోట్ల రూపాయల ఆస్తులు..అక్రమ వ్యాపార సామ్రాజ్యం..మానవ అవయవాల విక్రయాలు..హత్యలు..అత్యాచారాలు ఒక్కటేమిటి, తవ్వినా కొద్దీ బయటపడుతున్నాయి.

ఇక బాబా వ్యక్తిగత విషయానికొస్తే.. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడి హర్యానాలోని సునైరా జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదు. తనకు నిద్ర పట్టడం లేదని..అసహనంగా..విశ్రాంతి లేకుండా ఉందని గుర్మీత్‌సింగ్‌ బాబా జైలు సిబ్బందికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో జైలు సిబ్బంది వెంటనే డాక్టర్ల బృందాన్ని పిలిపించారు. గుర్మీత్‌సింగ్‌ను పరీక్షించిన డాక్టర్ల బృందం ఆశ్యర్యపోయే విషయం వెల్లడించినట్టు సమాచారం. గుర్మీత్‌సింగ్‌ సెక్స్‌ ఎడిక్ట్‌ అని..ఇప్పుడు అది లేకపోవడంతో అతనిలో విత్‌డ్రాల్‌ సింప్టమ్స్‌ కనిపిస్తున్నాయని చెప్పారట. ఏదైనా అలవాటుకు బానిసైన వ్యక్తి..ఒక్కసారిగా అది మానేస్తే తట్టుకోలేడు. ఇప్పుడు బాబా ఎదుర్కొంటున్న సమస్య కూడా అదేనట. జైల్లో అతనికి సెక్స్‌ చేసే అవకాశం లేకపోవడంతోనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారట. దీన్ని నయం చేయవచ్చునని..అయితే ఆలస్యం చేసినా కొద్దీ సమస్య మరింత తీవ్రమవుతుందని డాక్టర్లు చెప్పారట.

బాబా మద్యానికి బానిసనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. 1988 వరకు గుర్మీత్‌సింగ్‌ మద్యం సేవించేవాడని..ఆ తర్వాత సెక్స్‌ సామర్ధ్యం పెరగడానికి ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఎనర్జీ డ్రింక్స్‌, సెక్స్‌ టానిక్స్‌ తీసుకుంటున్నట్టు ఆయన్ను రెగ్యులర్ గా పరీక్షించే డాక్టర్‌ ఒకరు ఇంతకు ముందే చెప్పారు. కోర్ట్‌ గుర్మీత్‌కు ఉరిశిక్ష విధించినాక తన దత్తపుత్రిక, ఫిజియోథెరపిస్ట్‌గా చెప్పుకునే హానీప్రీత్‌సింగ్‌ను తనతో పాటే జైల్లో ఉండడానికి అనుమతించాలని కోర్టుకు పిటిషన్‌ పెట్టుకున్నారు.గుర్మీత్‌ను జైలు లోపలికి తీసుకెళ్లేటప్పుడు అప్పటి వరకు అతనితో ఉన్న హానీప్రీత్‌ను పోలీసులు పక్కకు జరపగా గుర్మీత్‌ పట్టరానంత ఆవేశం ప్రదర్శించారు. డేరా సచ్చా సౌదాలో గుర్మీత్‌ పడక గది నుంచి సాధ్విల హాస్టల్‌లోకి సొరంగ మార్గాలుండడం..ఆయన గదిలో కుప్పలు కుప్పలుగా నిరోద్‌లు, గర్భనిరోదక మాత్రలు, అబార్షన్‌ పిల్స్‌ ఉండడం వంటివి గమనిస్తే గుర్మీత్‌ సెక్స్‌ ఎడిక్ట్‌ అనే విషయం తేటతెల్లమవుతుంది.